వీఆర్‌వోలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం - రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తాo

  వీఆర్‌వోలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు కసరత్తు ప్రారంభించింది.


By PULI AMRUTH GOUD

 హైదరాబాద్ : వీఆర్‌వోలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. మంత్రి పాంగులేటి శ్రీనివాస రెడ్డి ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో వీఆర్‌వోల అంశంపై మాట్లాడారు. గత ప్రభుత్వం వ్యవస్థను ధ్వంసం చేసిందని అన్నారు. అందుకే వీఆర్‌వో వ్యవస్థను మళ్లీ ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని తెలిపారు. అంతేకాదు.. ధరణి పోర్టల్ పేరును కూడా మార్చుతున్నారని కీలక ప్రకటన చేశారు. ధరణి పేరుతో ఇష్టానుసారం దోచుకున్నవారిని తప్పకుండా జైలుకు పంపుతామని కీలక వ్యాఖ్యలు చేశారు.

Post a Comment

0 Comments