దుర్గామాతను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

 ఎల్కతుర్తి మండల కేంద్రంలోని పాత గ్రామపంచాయతీ వద్ద కొలువైన దుర్గామాతను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


 ఎల్కతుర్తి, అక్టోబర్ 10  ( తెలంగాణ టైమ్స్):
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని పాత గ్రామపంచాయతీ వద్ద కొలువైన దుర్గామాతను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దుర్గామాత అనుగ్రహం మన అందరితో పాటు రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని అన్నారు. అదేవిధంగా తెలంగాణ ఆడపడుచులకు అతి పెద్ద పండుగ అయినటువంటి గొప్ప పండుగ మన బతుకమ్మ పండుగ అని ప్రతి ఒక్కరూ బతుకమ్మ పండుగను  సంతోషంగా జరుపుకోవాలని అన్నారు.
 అనంతరం కమిటీ యూత్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ఎల్కతుర్తి మండల కమిటీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, టిపిసిసి సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ ముప్పు మహేందర్, సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు లు మంత్రిని శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పొన్నం అనూప్ తో పాటు  పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments