ఆ.. టౌన్ ప్లానింగ్ అధికారే అక్రమ నిర్మాణదారుడా..? ప్రజల గుసగుసలు..నిజమా?అబద్దమా? ప్లాట్ నెంబర్ 400,రోడ్ నెంబర్ 21,అయ్యప్పసొసైటీ,మాదాపూర్.

 * న్యాయస్థానాల ఆదేశాలను ధిక్కరించి అక్రమ నిర్మాణాలకు అండదండలు.

*ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని బ్రోకర్ గా పెట్టుకొని కోట్లాది రూపాయల వసూళ్లు.

*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిత్యం ఫిర్యాదులతో పోస్ట్ కార్డు ఉద్యమం.

*సదరు ఉద్యోగిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లోకాయుక్తలో కేసు వేయడానికి సిద్దమవుతున్న ప్రజలు.


(పులి అమృత్ ,సీనియర్ జర్నలిస్ట్ ) 

కంచె సేనును మేసిన చందంగా..అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాల్సిన ఓ టౌన్ ప్లానింగ్ అధికారే అక్రమ నిర్మాణానికి పాల్పడుతున్నాడని మాదాపూర్ డివిజన్ లో  ప్రజల గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇందులో నిజమెంతో విచారణలో తెలియాల్సి ఉన్నది.

కంచె సేనును మేసిన చందంగా..అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాల్సిన ఓ టౌన్ ప్లానింగ్ అధికారే అక్రమ నిర్మాణానికి పాల్పడుతున్నాడని మాదాపూర్ డివిజన్ లో  ప్రజల గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇందులో నిజమెంతో విచారణలో తెలియాల్సి ఉన్నది.శేరిలింగంపల్లి జోనల్ పరిధిలోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీ భూముల్లో వివాదం నెలకొని ఉన్నది.న్యాయస్థానాల ఆదేశాలను ధిక్కరించి,ఎలాంటి అనుమతులు లేకుండా మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని రోడ్ నెంబర్ 21  లోని 400  వ ప్లాట్ లో పెద్ద సెల్లార్ గుంత తవ్వి వారం రోజుల క్రితం భారీ అక్రమ నిర్మాణం చేపట్టారు.జి హెచ్ ఎం సి చందానగర్ సర్కిల్ 21 లో పని చేస్తున్న ఓ అధికారి,గతం లో ఎంపీ గా పోటీచేసి ఓడిపోయినా ఓ నాయకుడు (వ్యాపారవేత్త కూడ)తో కలిసి ఈ భారీ అక్రమ నిర్మాణం చేపట్టాడని స్థానికులు కొందరు ఆరోపిస్తున్నారు.
ఈ భారీ అక్రమ నిర్మాణాన్ని ఆదిలోనే అడ్డుకొని సదరు టౌన్ ప్లానింగ్ అధికారి తన నిజాయితీని నిరూపించుకోవాలని లేదంటే తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ అక్రమాలకు పాల్పడుతున్నాడని భావించాల్సి వస్తుందని పలువురు స్థానికులు తెలిపారు.ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని బ్రోకర్ గా పెట్టుకొని వందలాది అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించి కోట్లాది రూపాయల అవినీతి సొమ్మును పోగేసుకున్నారని ఏసిబి అధికారులు వీరిపై నిఘా పెట్టాలని పలువురు విజ్ఞప్తి చేసారు.
సదరు ఉద్యోగిపై విచారణ జరిపి చర్యలు తీసుకునేంత వరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిరోజూ పోస్ట్ కార్డు ద్వారా ఫిర్యాదులు చేస్తూ పోస్ట్ కార్డు ఉద్యమం చేపడుతామని,అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ అవినీతికి పాల్పడుతున్న సదరు అధికారిపై లోకాయుక్తలో కేసు వేయనున్నట్లు స్థానికులు కొందరు తెలిపారు.



Post a Comment

0 Comments