అక్రమ భూ మార్పిడి కేసులో తహసీల్దార్ అరెస్ట్ - 14 రోజుల రిమాండ్

  ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా భూమిని అక్రమంగా మార్పిడి చేసిన కేసులో తహసీల్దార్ అరెస్టు అయ్యారు.వివరాలలోకి వెళితే 2019 ఫిబ్రవరి నుంచి 2023 మధ్య కాలంలో సూర్యాపేట జిల్లా  హుజూర్ నగర్ మండల తహసీల్దార్ గా వి జయశ్రీ పనిచేశారు. ఆమె ధరణి కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ తో కలిసి  ఉన్నతాధికారులకు తెలియకుండా ప్రభుత్వ భూమిని ఇతరుల పేరున మార్పిడి చేశారు


 తెలంగాణ టైమ్స్ ( పులి అమృత్ గౌడ్ ) : 

 ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా భూమిని అక్రమంగా మార్పిడి చేసిన కేసులో తహసీల్దార్ అరెస్టు అయ్యారు.వివరాలలోకి వెళితే 2019 ఫిబ్రవరి నుంచి 2023 మధ్య కాలంలో సూర్యాపేట జిల్లా  హుజూర్ నగర్ మండల తహసీల్దార్ గా వి జయశ్రీ పనిచేశారు. ఆమె ధరణి కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ తో కలిసి  ఉన్నతాధికారులకు తెలియకుండా ప్రభుత్వ భూమిని ఇతరుల పేరున మార్పిడి చేశారు. హుజూర్నగర్ బూరుగడ్డ లో 16.30 గుంటల భూమిని పచ్చిపాల ప్రియాంక పేరున, 4.38 ఎకరాల భూమిని  జగదీష్ అక్క మడిపల్లి స్వప్న పేరున, 14.36 గుంటల భూమిని తల్లి ప్రియాంక పేరున, మొత్తం 36.23 ఎకరాల భూమిని ఐ ఎల్ ఆర్ ఎం ఎస్ పోర్టల్ ద్వారా బదలాయించారు. 14,63,004 రూపాయలు రైతుబంధు ద్వారా లబ్ధి పొందారు. ఈ విషయం ఇటీవల వెలుగులోకి రావడంతో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ధరణి ఆపరేటర్ జగదీష్ ను ఉద్యోగం నుంచి తొలగించి విచారణకు ఆదేశించారు. జగదీష్ ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించడం జరిగింది. విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హుజూర్ నగర్ సిఐ చరమంద రాజు తహసిల్దార్ వజ్రాల జయశ్రీని బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. సీనియర్ సివిల్ జడ్జి శ్యాం కుమార్ ఆమెకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించడంతో సబ్ జైలుకు తరలించారు. తహసిల్దార్ వజ్రాల జయశ్రీ, ధరణి ఆపరేటర్ జగదీష్ పై 220 (బి ), 449, 409, 420, 467,468 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


Post a Comment

0 Comments