By PULI AMRUTH
హైదరాబాద్:ఉస్మానియా యూనివర్సిటీలో డిఎస్సీ వాయిదా వెయ్యాలని నిరుద్యోగ యువకులు ఆందోళన చేస్తుంటే దానిని కవర్ చెయ్యడానికి వెళ్లిన జీ న్యూస్ జర్నలిస్టు శ్రీ చరణ్ ను పోలీసులు అరెస్టు చేయడం హేయనీయమని టీయూడబ్ల్యుజే అధ్యక్షులు అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, టెంజు అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, టెంజు ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్ అన్నారు.
విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను తాము జర్నలిస్టులమని చెబుతున్నా పోలీసులు దురుసుగా వ్యవహరిస్తూ వారిని బలవంతంగా లాక్కొని పోలీస్ వాహనంలో ఎక్కించుకొని పోలీసు స్టేషన్లో నిర్బంధించడం మీడియా భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని, తెలంగాణలో మరోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లాగా పోలీస్ రాజ్యం వచ్చిందా అనే విధంగా పోలీసుల వ్యవహార శైలి ఉందని పోలీసులు అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను వెంటనే విడిచిపెట్టాలని పోలీసులపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేసారు.భవిష్యత్తులో జర్నలిస్టుల పై పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడితే తప్పనిసరిగా ఆందోళన చేస్తామని టీయూడబ్ల్యుజే అధ్యక్షులు అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, టెంజు అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, టెంజు ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్ లు హెచ్చరించారు .
0 Comments