పర్యావరణ వారోత్సవాల పోస్టర్ ను విడుదల చేసిన చందానగర్ డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ

 తెలంగాణ టైమ్స్ :ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రేటర్ హైదరాబాద్ సంక్షేమ మండలి నిర్వహిస్తున్న పర్యావరణ వారోత్సవాల పోస్టర్ ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ శుక్రవారం సర్కిల్ కార్యాలయం లో విడుదల చేసారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జీవుల మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఒక్కటే మార్గమని అన్నారు

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రేటర్ హైదరాబాద్ సంక్షేమ మండలి నిర్వహిస్తున్న పర్యావరణ వారోత్సవాల పోస్టర్ ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ శుక్రవారం సర్కిల్ కార్యాలయం లో విడుదల చేసారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జీవుల మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఒక్కటే మార్గమని అన్నారు.భూమి వాతావరణాన్ని మెరుగు పరిచే మార్గాలను ప్రోత్సహించాల్సిన అవసరమున్నదని అన్నారు.సమాజములో ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలని వంశీకృష్ణ సూచించారు.గ్రేటర్ హైదరాబాద్ సంక్షేమ మండలి చైర్మన్, సీనియర్ జర్నలిస్ట్ పులి అమృత్ గౌడ్ మాట్లాడుతూ మానవునికి ఈ ప్రకృతికి విడదీయరాని అనుబంధం ఉన్నదని పర్యావరణ పరిరక్షణకు అవసరమైన తమవంతు కృషి చేస్తూ,సుస్థిర అభివృద్ధి వైపు అడుగులు వేయాలని ఉద్దేశం తో  ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమం లో గ్రేటర్ హైదరాబాద్ సంక్షేమ మండలి ప్రతినిధులు పి.అశోక్ గౌడ్ ,షేక్ బాజీ,పరమేశ్వర్ తదితరులు పాల్గన్నారు.


Post a Comment

0 Comments