శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా అబ్బుల కృష్ణాగౌడ్

By PULI  AMRUTH 

శేరిలింగంపల్లి, జూలై 13, (తెలంగాణ టైమ్స్) : శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా అబ్బుల కృష్ణ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే వి.జగదీశ్వర్ గౌడ్ శనివారం నియామక పత్రాన్ని అందజేశారు.


 తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన అబ్బుల కృష్ణ గౌడ్ మూడు సంవత్సరాలు 112 డివిజన్ టిఆర్ఎస్ ఉపాధ్యక్షులుగా, అలాగే నాలుగు సంవత్సరాల పాటు కొండాపూర్ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులుగా పనిచేశారు. అవినీతి మచ్చ లేకుండా బిఆర్ఎస్ పార్టీలో పని చేసిన కృష్ణ గౌడ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాగా కాంగ్రెస్ పార్టీలో ఆయన చేస్తున్న కృషిని గుర్తించి శేరిలింగంపల్లి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నియ మించారు. తన కృషిని గుర్తించి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా తనను నియమించినందుకు ఈ సందర్భంగా వి జగదీశ్వర్ గౌడ్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

Post a Comment

0 Comments