గొర్రెల పథకం కుంభకోణంలోని పాత్రదారులందరిని వెంటనే అరెస్ట్ చేయాలి : బీజేపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్ డిమాండ్

 గొర్రెల పథకం కుంభకోణంలోని పాత్రదారులందరిని వెంటనే అరెస్ట్ చేయాలని  బీజేపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్ డిమాండ్   చేశారు.


హనుమకొండ,అక్టోబర్ 24 (తెలంగాణ టైమ్స్ ) : గొర్రెల పథకం కుంభకోణంలోని పాత్రదారులందరిని వెంటనే అరెస్ట్ చేయాలని  బీజేపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్ డిమాండ్   చేశారు.గొర్రెల పథకం కుంభకోణంలో పశుసంవర్ధక శాఖ అధికారులు గతంలో వరుసగా కొంత మంది అధికారులు అరెస్ట్ అయ్యారని మిగితా సూత్ర దారులను,పాత్ర దారులను వెంటనే అరెస్ట్ చేయాలని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేసారు. ఏసీబీ అధికారులు గొర్రెల పథకం కుంభకోణంలో రాష్ట్రవ్యాప్తంగా 700 కోట్లు అవినీతి జరిగినట్లు గుర్తించారు.

 నాగర్ కర్నూలు జిల్లా పశు సంవర్తక శాఖ జీడిగా పనిచేసిన అంజిలప్ప గతంలోనే అరెస్టు కావడం జరిగిందని  వివిధ మండలాలకు చెందిన వెటర్నరీ డాక్టర్లు అంజిలప్పతో చాలా క్లోజ్ గా ఉండేవారని రాష్ట్రస్థాయి అధికారులు, పశుసంవర్ధకశాఖ సీఈవో, ఎండి లు,  మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఓఎస్డి కళ్యాణ్ కుమార్లను గతంలో ఏసీబీ అధికారులు అరెస్టు చేసినా  మిగితా సూత్ర దారులను,పాత్ర దారులను వెంటనే అరెస్ట్ చేయాలని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేసారు కాగా పలు జిల్లాల్లోని  కొందరు వెటర్నరీ ఆవినీతి అధికారుల గుండెల్లో గుబులు రేగుతుందని అన్నారు.అచ్చంపేట డివిజన్ లోని కొందరు వెటర్నరీ వైద్యులు నిధుల దుర్వినియోగం లో పాత్ర ఉన్నట్లు  ప్రచారం జరుగుతుంది. లబ్ధిదారులకు పంపించవలసిన నిధులను  పక్కదారి పట్టించి లక్షల రూపాయలు ప్రభుత్వ ప్రజాధనాన్ని  దుర్వినియోగం చేసినట్లు విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తులను మధ్యవర్తులుగా వినియోగించి బినామీ వ్యక్తుల ఖాతాలకు గొర్రెల పథకం నిధులు మళ్లించిన పాత్రలో కొందరు వెటర్నరీ డాక్టర్ల పాత్ర ఉందని అన్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ గొర్రెల పంపిణి కుంభకోణం లో ప్రజల డబ్బులను మెక్కిన విశ్వాస ఘాతకులను అరెస్ట్ చేయకపోతే బిజెపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యం లో పోరాటం చేయక తప్పదని ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు



Post a Comment

0 Comments