విద్యార్థి అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం : పులి అమృత్ గౌడ్

 

హైదరాబాద్ ,జూన్ 2 ,ధ్వని ప్రతినిధి : విద్యార్థి అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని గ్రేటర్ హైదరాబాద్ సంక్షేమ మండలి చైర్మన్,సీనియర్ జర్నలిస్ట్  పులి అమృత్ గౌడ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం గ్రేటర్  హైదరాబాద్ సంక్షేమ మండలి ఆధ్వర్యం లో మదీనగూడలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రేటర్ హైదరాబాద్ సంక్షేమ మండలి సభ్యులు మొదట తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.అనంతరం పులి అమృత్ గౌడ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు.ఈ కార్యక్రమం లో అమృత్ గౌడ్ తో పాటు హైదరాబాద్ సంక్షేమ మండలి సభ్యులు,షేక్ భాజీ,బి.నరేష్,ముస్తఫా,శ్రీను,రత్నం రెడ్డి,నర్సింహులు,పులి అశోక్ గౌడ్, షోయబ్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments