సర్వ సంస్కృతుల సమ్మేళనం ఈ తెలంగాణ :శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్


 ( పులి అమృత్ గౌడ్ )

శేరిలింగంపల్లి,జూన్ 2  : సర్వ సంస్కృతుల సమ్మేళనం ఈ తెలంగాణ అని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్  గౌడ్ అన్నారు.శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో నిర్వహించిన  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

చందనగర్ డివిజన్ పరిధిలో మాజీ కార్పొరేటర్ శ్రీ.అశోక్ గౌడ్ తో  కలిసి డివిజన్ అధ్యక్షులు,నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగదీశ్వర్ గౌడ్ పాల్గొని  త్రివర్ణాన్ని పతకాన్ని ఎగురవేశారు. అనంతరం  తెలంగాణ అమరవీరులకు,  తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టితో మమేకం,మమకారమే ఆభరణం,సర్వ సంస్కృతుల సమ్మేళనం తెలంగాణ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు,డివిజన్  అధ్యక్షులు,డివిజన్ ఇన్చార్జులు,మైనారిటీ,మహిళా,యువ నాయకులు,ఎన్ ఎస్ యు ఐ,సేవాదళ్ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

https://www.youtube.com/watch?v=YRhfRbTubMc

Post a Comment

0 Comments