( పులి అమృత్ )
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్కలు శనివారం రాజ్ భవన్ కు వెళ్లి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాల్సిందిగా గవర్నర్ రాధాకృష్ణన్ కు ఇన్విటేషన్ అందించారు.ఈ సందర్బంగా గవర్నర్ తో పలు అంశాలపై చర్చించారు.పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే ఈ వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.సి ఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సోనియాగాంధీని కలిసి స్పెషల్ గెస్ట్ గా రావాలని ఆహ్వానించారు.ఈ సందర్బంగా సోనియాగాందీని ప్రత్యేకంగా సన్మానించాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది.
0 Comments