మంత్రి పొన్నం పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదు.పాడి కౌశిక్ రెడ్డిపై పులి అమృత్ గౌడ్ ఆగ్రహం

 హైదరాబాద్ : బీసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సీనియర్ జర్నలిస్ట్,ఫిలిం మేకర్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పులి అమృత్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

బీసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సీనియర్ జర్నలిస్ట్,ఫిలిం మేకర్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పులి అమృత్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.వంద కోట్ల అవినీతి చేసారని కౌశిక్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేసిన నేపథ్యం లో సోమవారం ఆయన హైదరాబాద్ లో మీడియా తో మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలకు పైగా విద్యార్ధి దశ నుంచి ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేకుండా ఎదిగిన బడుగు బలహీన వర్గాల నాయకుడైన పొన్నం ప్రభాకర్ పై నోటికి వచ్చినట్లు మాట్లాడితే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయం లో అప్పటి ఎం పీ గా వున్న పొన్నం ప్రభాకర్ చేసిన కృషి,పోరాట పటిమ అందరికి తెలిసిందేనని ఉత్తమ పార్లమెంటేరియన్ అయినటువంటి జైపాల రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పొన్నం ప్రభాకర్ పాత్ర,ఆయన చేసిన కృషిని పొగిడిన విషయం రాష్ట్ర ప్రజలందరికి తెలుసని అన్నారు.తెలంగాణ ఉద్యమ సమయం లో ఉద్యమ కారులపై రాళ్లు విసిరిన కౌశిక్ రెడ్డి కి పొన్నం ప్రభాకర్ పేరు ఎత్తే అర్హత కూడా లేదని అన్నారు.తనకు ఓట్లు వేయకుంటే కుటుంబం తో సహా ఆత్మహత్య చేసుకుంటానని ఓటర్లను సైకలాజికల్ బ్లాక్మెయిల్ చేసి అనైతికంగా గెలిచిన కౌశిక్ రెడ్డి  నీతి,నిజాయితితో ప్రజల పక్షాన పోరాటాలు చేసి ఎదిగిన ప్రజానాయకుడు పొన్నం ప్రభాకర్ పై నిరాధారమైన విమర్శలు,ఆరోపణలు చేస్తే సహించేది లేదని పులి అమృత్ గౌడ్ హెచ్చరించారు.


Post a Comment

0 Comments