*అనుమతులకు విరుద్దంగా నిర్మాణం.
*గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు ఫిర్యాదు.
చందానగర్ : చందానగర్ ఆర్టీసీ కాలనీ రోడ్ లో సర్వే నెంబర్ 320 / 1 లోని ప్లాట్ నెంబర్ లు 7 మరియు 8 లలో నిబంధనలను ఉల్లంఘించి నిర్మిస్తున్న నిర్మాణదారులపై,నిర్మాణం పై చర్యలు తీసుకోవలసిందిగా స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
చందానగర్ ఆర్టీసీ కాలనీ రోడ్ లో సర్వే నెంబర్ 320 / 1 లోని ప్లాట్ నెంబర్ లు 7 మరియు 8 లలో నిబంధనలను ఉల్లంఘించి నిర్మిస్తున్న నిర్మాణదారులపై,నిర్మాణం పై చర్యలు తీసుకోవలసిందిగా స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఉత్తమ్ కుమార్ చౌదరి,లలిత్ కుమార్ చౌదరి అనే వ్యక్తులు సర్వే నెంబర్ 320 / 1 లోని ప్లాట్ నెంబర్ లు 7 మరియు 8 లలో రెసిడెన్సియల్ భవన నిర్మాణానికి అనుమతులు పొందారు.(File No .009089 / GHMC /4522 /SLP 2 / 2023 - BP ) కాగా అనుమతుల నిబంధనలు ఉల్లంఘించి కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నారని స్థానికులు కొందరు తెలిపారు.ఈ కాలనీలో గతం లోనే ప్రభుత్వం రోడ్ వైడింగ్ ప్రపోజల్ పెట్టింది.దీంతో శ్రీ మురళీధర్ వెల్ఫేర్ సొసైటీ వారు హైకోర్టుకు వెళ్లి స్టేటస్కో ఆర్డర్ తెచ్చారు.ఇంత తతంగం జరుగుతున్నది.అయితే బిల్డింగ్ పర్మిషన్ అనుమతి దరఖాస్తులో కూడా పడమర వైపు రోడ్డు ఫోటో బదులు సంబంధం లేని ఫోటో పెట్టారు.దక్షిణం వైపు ఒక భవనం ఉండగా కాళీ ప్లాటు ఉన్నట్లు చూపారు.కొన్ని తప్పులతో రెసిడెన్సియల్ అనుమతులు తెచ్చుకొని ఉద్దేశ పూర్వకంగా కమర్షియల్ బిల్డింగ్ నిర్మిస్తున్నారని ఇందుకు మున్సిపల్ అధికారులకు ఆమ్యామ్యాలు అందించి ఉంటారని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ కమర్షియల్ భవనం తో భవిష్యత్తులో స్థానిక ప్రజలకు ఇబ్బందిగా మారుతుందని, ఈ నిర్మాణం పై,నిర్మాణ దారులపై చట్టపరమైన చర్యలు తీసుకోక పొతే తాము చందానగర్ సర్కిల్ కార్యాలయం ముందు ధర్నా చేయాల్సి వస్తుందని స్థానిక ప్రజలు హెచ్చరించారు.కాగా జి.హెచ్.ఎం.సి నిబంధనలను ఉల్లంఘించి నిర్మిస్తున్న ఈ నిర్మాణం పై చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ గ్రేటర్ హైదరాబాద్ సంక్షేమ మండలి ప్రతినిధులు శనివారం జి.హెచ్.ఎం.సి కమీషనర్ కు ఫిర్యాదు చేసారు.
.jpg)
0 Comments