Girl Hung From Building's Terrace | యువకుడి చేతిని పట్టుకున్న ఒక యువతి బిల్డింగ్ అంచు నుంచి ప్రమాదకరంగా గాలిలో వేలాడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు మండిపడ్డారు. వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
యువకులు రీల్ కోసం పాట్లు పడుతున్నారు. ప్రాణాలను లెక్కచేయక ప్రమాదకరంగా స్టంట్లు చేస్తున్నారు. యువకుడి చేతిని పట్టుకున్న ఒక యువతి బిల్డింగ్ అంచు నుంచి ప్రమాదకరంగా గాలిలో వేలాడింది. (Girl Hung From Building’s Terrace) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు మండిపడ్డారు. వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. ఒక జంట రిస్కీ స్టంట్ చేసింది. పూణేలోని స్వామి నారాయణ్ టెంపుల్ సమీపంలోని నిర్మాణుష్య బిల్డింగ్‌పై రీల్ రికార్డ్ చేశారు. అబ్బాయి చేయి పట్టుకున్న ఒక అమ్మాయి టెర్రస్ అంచు నుంచి ప్రమాదకరంగా గాలిలో వేలాడింది. ఆ బిల్డింగ్ పక్కనే రద్దీ రహదారి ఉంది. ఆ జంటకు చెందిన స్నేహితులు మొబైల్ ఫోన్‌లో ఈ రీల్‌ను రికార్డ్ చేశారు.
0 Comments